Oct 08,2023 21:24

ఫొటో : మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు

సిఎంను త్వరగా ఇంటికి పంపుదాం..
ప్రజాశక్తి-కావలి : రానున్న 2024 ఎన్నికల్లో సిఎంను ఇంటికి సాగనంపి, టిడిపిని గెలిపించుకుంటామని మాలేపాటి సుబ్బానాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద టిడిపి పార్టీ కుటుంబ సభ్యులతో ఆదివారం ''రిలే నిరాహార దీక్షలు'' టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ ఈరోజుకి చంద్రబాబు నాయుడుని 30 రోజులుగా జైలులో ఉంచారని, కనీసం ఆయనకు జైలులో మంచి వసతులు కూడా కల్పించకుండా కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
ప్రస్తుతం ఓటర్ల జాబితాలో అక్రమంగా జరుగుతున్న కార్యక్రమాలను కావలి నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఓట్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గొట్టిపాటి రాము, బొట్లగుంట శ్రీహరి నాయుడు, మంచాల ప్రసాద్‌, శివకుమార్‌, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.