Jul 26,2022 22:00

సిఎం సహాయనిధి చెక్కులు అందజేత
ప్రజాశక్తి- నగరి:
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖా మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు అందించారు. మంగళవారం మంత్రి నివాస కార్యాలయంలో 16 మంది లబ్దిదారులకు రూ.8లక్షలు విలువచేసే సిఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్దిదారులు తమకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి, మంత్రి రోజాకి కృతజ్ఞతలు తెలిపారు.