సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనోజ్‌కుమార్, తుకారం, సంధ్యలకు రూ.2,72,000ల చెక్కును శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో చిత్తూరు ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు అందించారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆరోగ్యశ్రీ మరియు సీఎం సహాయక నిధి ద్వారా వైద్యఖర్చులు ఉచితంగా చేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో గుడిపాల సింగల్ వంటి అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, వైసిపి నాయకులు చిట్టిబాబు, సెంథిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










