సిఎం రిలీప్ చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణ వైసిపి కార్యాలయంలో మంగళవారం గుడ్లూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బంక బ్రహ్మయ్యకు రూ 3.50 లక్షలు, కందుకూరు పట్టణానికి చెందిన గొర్రె పాటి తేజస్వి కి రూ 65 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను ఎంఎల్‌శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పంపిణీ చేశారు. మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలలో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా కోల ుకోలేని వారిని ఆదుకోవాలని గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.










