సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
28న నగరికి రానున్న ముఖ్యమంత్రి
సిఎం సభను విజయవంతం చేయాలి: కలెక్టర్
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: జెసి
ప్రజాశక్తి- నగరి : ఈనెల 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి నగరి పర్యటనకు ఏర్పాట్లు పరిపూర్ణంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు విడివిడిగా అధికారులతో సమీక్ష నిర్వహించి సూచించారు. గురువారం ఉదయం నగరి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో జాయింట్ కలెక్టర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, నగరి, కుప్పం ఆర్డీఓ సుజనా, శివయ్యలతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధిత ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జెసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 28న నగరి పట్టణంలో జగనన్న విద్యాదీవెన పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని వారికి కేటాయించిన పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. పర్యటనకు సంబంధించి చేపట్టవలసిన బాధ్యతలను శాఖలవారీగా కేటాయించారు. కేటాయించిన విధులను ఆయా శాఖలు బాధ్యతతో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వర్తించాలన్నారు. సమీక్షా సమావేశం నిర్వహణకు మునుపు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు, హెలిప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయించిన స్థలాలను, వాహనాల పార్కింగ్ స్థలాలను నగరి ఆర్డీఓతో కలసి పరిశీలించారు. ఈకార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భవాని, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ కిరణ్మయి, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా పిడిలు, తులసి, రాధమ్మ, గంగాభవాని, ఎస్‌ఈ పంచాయతీ రాజ్ చంద్రశేఖర్ రెడ్డి, డీఈఓ విజయేంద్ర రావు, బిసి సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల డీడీలు రబ్బానీ బాషా, డాక్టర్ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష పిఓ వెంకట రమణారెడ్డి, ఆర్‌టిసి ఆర్‌ఎం జితేంద్ర నాధ్‌రెడ్డి, డిటిసి నిరంజన్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ కష్ణారెడ్డి, డిపిఓ లక్ష్మీ, సమాచారశాఖ ఇన్‌చార్జి డిడి పద్మజ, ఎస్‌సి సంక్షేమ, సాధికారత అధికారి నరసింహులు, డిఎల్‌డిఓ రవి కుమార్, నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, నగరి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సభ, హెలిప్యాడ్ ప్రదేశాల పరిశీలన
ముఖ్యమంత్రి ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యాదీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నగరికి విచ్చేయనున్న నేపధ్యంలో బహిరంగ సభ, హెలిపాడ్ ఏర్పాటుచేయనున్న ప్రదేశాలను ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశీల రఘురాంతో కలిసి జిల్లా కలెక్టర్ సంగిలి షన్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు గురువారం పరిశీలించారు. ఈసమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్నిశాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.










