Mar 20,2022 23:13

జుబిలేషన్‌ వేడుకల్లో కళాశాల ఛైర్మన్‌ అశోక్‌ రాజ్‌, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, ఆర్‌జే కాజల్‌

అలరించివ హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా (జాతిరత్నాలు హీరోయిన్‌)
ప్రజాశక్తి- నారాయణవనం:
పుత్తూరు పట్టణంలోని సిద్దార్థ 21వ జుబిలేషన్‌ సెలబ్రేషన్‌ వేడుకలు అట్టహాసంగా నిర్వహించినట్లు చైర్మన్‌ అశోక్‌ రాజు తెలిపారు. 2వ రోజు ముగింపు వేడుకల్లో అతిధిలుగా హాజరైన సినీ హీరోయిన్స్‌ ఫరియా అబ్దుల్లా(జాతిరత్నాలు సినిమా హీరోయిన్‌), పూర్ణ, యాంకర్‌ కాజల్‌ బిగ్‌ బాస్‌ ఫేమ్‌, ఆట సందీప్‌, జ్యోతి రాజ్‌ ఆధ్వర్యంలో డ్యాన్స్‌, ఆరోహి వారి బ్యాడ్‌ బందం 3గంటల పాటు అలరించారు. అతిధుల సందేశాలు అకడమిక్‌ టాపర్లకు, స్పోర్ట్స్‌ చాంపియన్స్‌కు, బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్లకు మెడల్స్‌ మెమెంటోలు, సర్టిఫికెట్‌ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అశోక్‌ రాజు మాట్లాడుతూ గత 21సంవత్సరాలుగా సిద్ధార్థ కుటుంబం అంకితభావంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా పనిచేసిన కషి ఫలితమే తమ విద్యార్ధులకు నూటికి నూరుశాతం ఉద్యోగాల అవకాశం ఎక్కడ లేనివిధంగా 40లక్షల ప్యాకేజీతో విద్యార్థులు విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఇందిర వెని, పూర్ణ, కాజల్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ప్రిన్సిపల్‌, జానార్దన్‌ రాజు, హెచ్‌ఓడీలు విద్యార్థులు పాల్గొన్నారు.