ప్రజాశక్తి - పెనుగొండ
మండలంలోని సిద్ధాం తం రజక జనసేవ సంఘం వారు తమ కుల వృత్తి చేసుకునే చెరువుల చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్లకంపలను ఆదివారం శ్రమదానం చేసి శుభ్రం చేసుకున్నారు. సంఘ అధ్యక్షుడు దువ్వారపు వెంకట్రావు నాయకత్వంలో సుమారుగా 75 కుటుంబ సభ్యులు తమ సంఘ పరిధిలో ఉన్న రెండు చెరువుల చుట్టూ కులవృత్తులు చేసుకోవడానికి అణువుగా లేకుండా పెరిగిపోయిన ముళ్లకంపలు, మందుబాబులు తాగి పడేసిన బ్రాందీ బాటిల్స్ తీసివేయడానికి శ్రమదానం చేసుకుని, ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి, చెరువులో బట్టలు ఉతకటానికి బల్లలు ఏర్పాటు చేసుకున్నారు.










