ప్రజాశక్తి - పెనుగొండ
మండలంలోని సిద్ధాంతం గ్రామంలో బుధవారం జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికీ వెళ్లిన ఎంఎల్‌ఎను సిద్ధాంతం శివారు ఘటాల దెబ్బ కాలనీ వాసులు నిలదీశారు. 103 ఇళ్ల పట్టాలు పెండింగ్‌లో ఉన్నాయని, కరోనా సమయంలో కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారని వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడలి నాగ గోవిందు, దామోదర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










