May 13,2023 22:12

ప్రజాశక్తి - గణపవరం
           పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన శ్రీ చైతన్య సిబిఎస్‌ఇ పాఠశాల విద్యార్థులను ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు శనివారం అభినందించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు శనివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతికి సిబిఎస్‌ఇ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ పి.రామ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ సిహెచ్‌.నవ్యశ్రీ 469 మార్కులతో ప్రథమస్థానం, జి.పార్ధు 400తో ద్వితీయస్థానం, హాసిని 426తో తృతీయస్థానం, ఎ.కీర్తన 425తో నాలుగో స్థానం, వి.అను 413తో ఐదో స్థానంలో నిలిచారని తెలిపారు. వీరిని ఎంఎల్‌ఎ వాసుబాబు, పాఠశాల ఎజిఎం వైఎన్‌.శ్రీనివాస్‌, రీజియన్‌ ఇన్‌ఛార్జి ఎం.పార్ధసారధి, ఎ.రామారావు, పదో తరగతి ఇన్‌ఛార్జి రామకృష్ణ అభినందించారు.