విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
సిబిఎస్‌ఇ క్లస్టర్ -7
అథ్లెటిక్స్ ఆటలకి వేదికగా అదాని వరల్డ్ స్కూల్...
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:కృష్ణ్ణాపట్నంలోని అదాని వరల్డ్ స్కూల్‌లో సిబిఎస్‌ఇ క్లస్టర్స్ -7 అథ్లెటిక్స్ (బోర్సు అండర్- 14/17/19) పోటీలను గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి సిఎస్‌ఆర్ హెడ్ రాజేష్ రంజన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా వేదికను ప్రారంభించారు. అదాని వరల్డ్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సిరియాల మాట్లాడుతూ నేటి నుంచి 29 వరకూ జరిగే ఈ అథ్లెటిక్స్ పోటీలలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల లోని సుమారు 60 పాఠశాలల నుంచి 800కి పైగా విద్యార్థులు వారి కోచ్‌లతో హాజరవుతున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగా రన్నింగ్ రేస్, జావీలింగ్ త్రో, షాట్‌పుట్, హైజంప్, లాంగజంప్ లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులను ఏర్పాటు చేశామన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










