Jul 18,2023 20:18

ప్రజాశక్తి - తణుకు
సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సంతృప్తికరమైన సేవలందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం తణుకు పురపాలక సంఘ పరిధిలో ఆరో వార్డు సచివాలయాన్ని జెసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. వార్డు సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టికను, సంక్షేమ పథకాల క్యాలెండర్లు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఎనిమిదో వార్డు ఇంద్రయ్య నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని జెసి తనిఖీ చేశారు. అలాగే తణుకు పురపాలక సంఘ పరిధిలో ఉమెన్స్‌ కాలేజీ దగ్గర్లో ఉన్న 15 ఎకరాల దేవాలయ భూములను పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్‌ పిఎండి.ప్రసాద్‌ పాల్గొన్నారు.
పెనుగొండ: దొంగరావిపాలెం పర్యాటక భూములను జెసి రామ్‌ సుందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక కేంద్రాల మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందితే యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగావకాశాలు మెండుగా వస్తాయన్నారు. ఆయన వెంట తహశీల్దార్‌ ఎన్‌.గురుమూర్తిరెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.