సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
చిత్తూరు జిల్లా ఎనిమిదవ సిఐటియు జిల్లా మహాసభలు డిసెంబర్ 19, 20 తేదీల్లో చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్లో జరగనున్నాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పెద్ద కార్మిక సంఘం సిఐటియు అని అన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి కార్మిక పోరాటాలను సమీక్ష చేసుకుని భవిష్యత్ పోరాటాలకు పదును పెట్టేలా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. జిల్లా విభజన అయిన తరువాత మొట్టమొదటిసారిగా మహాసభలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కోట్లాదిమంది కార్మికల ఉపాధి దెబ్బతీస్తున్నారన్నారు. దీనికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సైతం కార్మికులకు ఎలాంటి వేతనాలు పెంచకుండా పోరాడుతున్న కార్మికులపై నిర్బంధం విధిస్తోందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాడా గంగరాజు, చైతన్య మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటైన తరువాత పవర్‌లూం కార్మికులకు వేతనాల కోసం పోరాటం చేశామని, అంగన్‌వాడీ, ఆశ, విఒఎ, పంచాయతీ, చింతపండు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు జరిగాయన్నారు. జిల్లాలో పెద్దసంఖ్యలో ఉన్న గ్రానైట్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. సిఐటియు ఎంత బలపడితే కార్మికుల సమస్యలు అంత తొందరగా పరిష్కారం అవుతాయన్నారు. ఈ వర్క్ షాప్ లో సిఐటియు జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా, భువనేశ్వరి ,సురేంద్ర, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి షకీలా, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గోవిందప్ప, పవర్‌లూం జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్, ఆశ, వీవోఏ, మధ్యాహ్న భోజనం, హమాలి, బిల్డింగ్, ఆటో తదితర రంగాల నుండి పాల్గొన్నారు.










