డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వినతి
ప్రజాశక్తి తిరుపతి టౌన్: ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం బాధితులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కలిసి తమ గోడును విన్నవించారు. తిరుపతి సబ్‌కలెక్టర్ ఆఫీస్ లో డిప్యూటీ సీఎంను రాధాకష్ణ మాట్లాడుతూ గతంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ 3000 మంది ఇళ్లస్థలాలను, 250 మంది రైతులు సమస్య తెలియజేశారు. సీఎం వెంటనే వీరి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కి చెప్పారు. కలెక్టర్, జెసి, వెంటనే తమ సమస్యపై కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఆర్‌డిఓ ఆఫీస్‌లో ఆలస్యం జరుగుతున్నదని ఆయనకు తెలియజేశారు. అందుకు స్పందిస్తూ పక్కనే ఉన్న ఆర్‌డిఓకి ఇది సీఎం చెప్పిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్‌డిఓ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో ఇచ్చేస్తామని తెలియజేశారు. పాల్గొన్న కమిటీ నాయకులు ఎన్. శ్రీనివాసులు, జిల్లేడు మోహన్, హేమలత, వై.శ్రీనివాసులు. టీచర్ సుబ్రహ్మణ్యం. సభ్యులు: నరసింహులు, గంగాధర్, రామాంజల్, రవి,మునిరత్నం, అమరేంద్ర, మురళి, కొర్లగుంట సుబ్రహ్మణ్యం, గౌరీ, లక్ష్మీదేవి, సుశీలమ్మ, భాగ్య, నాగమ్మ, గురునాథం, గురవయ్య, శాంతి, హమాలి యూనియన్ నాయకులు రమేష్, వెంకటప్ప, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు










