Apr 03,2023 22:12

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   రాజ్యాంగ హక్కుగా దేశంలో విద్యార్థులకు ఉన్న స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం హక్కులను హరిస్తున్న సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టర్‌ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సెంట్రల్‌ యూనివర్శిటీలో చోటు చేసుకున్న అవతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, భోజనంలో పురుగులు వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని విసికి ఫిర్యాదు చేశారనే నెపంతో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేయడం బాధాకరమన్నారు. వెంటనే విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి గిరి, నాయకులు విజరు, చంద్రకాంత్‌, వినోద్‌, కిరణ్‌, తదితర నాయకులు పాల్గొన్నారు