May 19,2023 22:13

సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ సాయిరాం

         ప్రజాశక్తి-అనంతపురంసిటీ   సెలవుల్లో అడ్మిషన్లు నిర్వహి ంచినా..పాఠశాలలు నిర్వహించినా చర్య లు తప్పవని డిఇఒ ఎం.సాయిరాం హెచ్చ రించారు. శుక్రవారం నగరంలోని కెఎస్‌ఆ ర్‌ పాఠశాలలో జిల్లాలోని ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల తో డిఇఒ సమావేశం నిర్వహించారు. ము ందుగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రయివే ట్‌ పాఠశాలల యాజమాన్యాలను అభినం దించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ పిల్లలకు ఒత్తిడి కలిగించకుండా బోధన చేయాలన్నారు. సెలవుల్లో పాఠశాలల్లో అడ్మిషన్లు చేయరాదన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాతనే ప్రభుత్వ నిబంధనలకు లోబడి అడ్మిషన్లు చేయాల న్నారు. అలాగే పాఠశాలల పేర్లతో ముద్రించిన పుస్తకాలను విక్రయించరాదన్నారు. ఇకపోతే పాఠశా లలు, కళాశాలల బస్సులను కండీషన్‌లో ఉంచాల న్నారు. లైసెన్సులు కలిగిన డ్రైవర్లను ఉంచుకోవాల న్నారు. ఆయా నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివిఇఒ ఎం.వెంకటరమణనాయక్‌, ఆర్‌ఐఒ జి.సురేష్‌బాబు, ఉపవిద్యాధికారులు పద్మప్రియ, శంకర్‌ప్రసాద్‌, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌, ఎంఇఒ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.