Oct 13,2023 22:23

ఫొటో : రక్తదానం చేస్తున్న దాతలు

'సేవియర్స్‌' మెగా రక్తదాన శిబిరాలు
ప్రజాశక్తి-కావలి : కావలికి చెందిన సీనియర్స్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఏకకాలంలో రెడ్‌క్రాస్‌, విశ్వోదయ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఆర్‌.ఎస్‌.ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్‌లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 500 మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం రవి నర్సింగ్‌ హోమ్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.బి.ఎస్‌. ఇంజనీరింగ్‌ కళాశాల కావలి, అభయం స్వచ్ఛంద సేవాసంస్థ, ఐఆర్‌సిఎస్‌ యోగా కేంద్రం, రోటరీ క్లబ్‌, ఎస్‌బిఐ టౌన్‌ బ్రాంచెస్‌, జెవివి వారు సహకారం అందించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు లైఫ్‌కేర్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ నళిని పద్మ, డిబిఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌, నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ సుధీర్‌ నాయుడు, ప్రకాశం జిల్లా బాధ్యులు గంధం ప్రసన్నాంజనేయులు పాల్గొని రక్తదాతలను, నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా సేవియర్‌ సభ్యులు మాట్లాడుతూ తమకు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన విశ్వోదయ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యానికి, ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ యాజమాన్యానికి, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ రవికి, డిబిఎస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌ సుధీర్‌ నాయుడుకు, రిటైర్డ్‌ ఎస్‌బిఐ మేనేజర్‌ హరినారపరెడ్డికి, లైఫ్‌కేర్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ నళిని పద్మకు, అభయం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఇవిఎస్‌కి, ఐఆర్‌సిఎస్‌ యోగా కేంద్ర నిర్వాహకులు జనార్ధన్‌ గురూజీకి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కావలి చైర్మన్‌ రవి ప్రకాష్‌కు, కావలి రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ దినేష్‌కు, జన విజ్ఞాన వేదిక సభ్యులకు, వారి పిలుపునందుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన రక్తదాతలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వారందరి సహకారంఎప్పుడు తమకు ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సేవియర్‌ సభ్యులు, రెడ్‌క్రాస్‌ బాధ్యులు పాల్గొన్నారు.