Oct 02,2023 21:53

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తునన జర్నలిస్టులు

'సేవ్‌ జర్నలిజం డే' విజయవంతం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఐజెయు ఆదేశాల మేరకు ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరులో సేవ్‌ జర్నలిజం డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుండి జర్నలిస్టులు ర్యాలీగా బయల్దేరి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గాంధీజీ విగ్రహానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె జిల్లా ఉపాధ్యక్షులు సోమ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సేవ్‌ జర్నలిజం డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా ఈ కార్యక్రమానికి ఐకమత్యంగా కలిసి రావడం ఇది ఒక శుభ పరిణామమన్నారు. ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ రమణారెడ్డి, వేముల శ్రీనివాసులు, సుబ్బారావు, ఎమ్‌డి రహమత్‌ అలీ, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.