Feb 22,2022 22:44

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను సన్మానిస్తున్న అడిషన్‌ ఎస్‌పి


అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ మహేష్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
దాదాపు 38 సంవత్సరాల పాటు అంకిత భావంతో అందించిన సేవలు పోలీసు శాఖ గుర్తుంచు కుంటుందని, ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ మహేష్‌ మాట్లాడుతూ పోలీసు డిపార్టుమెంటులో పనిచేయడం సవాలుతో కూడుకొన్నదని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో పోలీసు విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని, కుటుంబ సభ్యులతో ప్రయాణం సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబం లో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాలులో జనవరి నెలలో పదవీ విరమణ పొందిన వినోద్‌ కుమార్‌, మదనపల్లి యూనిట్‌ వారిని వారి కుటుంబ సమేతంగా ఘనంగా సన్మానించి జ్ఞాపికలను, విలువైన బహుమానాలను, జిల్లా హోం గార్డ్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుండి రూ. 4 లక్షల చెక్కును అందించారు.