Nov 21,2022 22:10

సదుంలో వెటర్నరీ కళాశాల నిర్మాణం కోసం స్థలపరిశీలన
ప్రజాశక్తి- సోమల :
మండల కేంద్రమైన సదుంలో వెటర్నరీ కళాశాల నిర్మాణం కోసం స్థలపరిశీలన ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టారు. 10కోట్ల రూపాయల నిధులతో సదుం ఎర్రాతివారిపల్లె మార్గమధ్యంలోని స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశారు. రాష్ట్ర వైసిపి కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశానుసారం వెటర్నరీ కళాశాల నిర్మాణ కోసం స్థలపరిశీలన చేశామని పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే కళాశాల తరగతి గదులు ప్రారంభించి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, నిర్మాణపనులు పూర్తికాగానే శాశ్వత భవనంలోకి మార్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్వీ వెటర్నరీ కళాశాల డీన్‌ బ్రహ్మయ్య, రిజిస్టార్‌ రవి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ నగేష్‌, జడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, మంత్రి వ్యక్తిగత సహాయకులు మునితుకారం తదితరులు పాల్గొన్నారు.