ప్రజాశక్తి - సోమల
పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం సదుం, సోమల మండలాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సదుం ఎర్రాతి వారి పల్లె అయ్యప్ప స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం గార్గేయ నదిపై జాండ్రపేట వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి ,సోమల మండలం దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి ఆలయ అభివద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలను అందజేశారు. 8 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఆలయ అభివద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










