ప్రజాశక్తి-పాలకొల్లు : ప్రతి ఉద్యోగికి సంతోషం బాధలు ఉంటాయని సచివాలయ మహిళా పోలీస్ లకు కూడా బాధలు ఉంటాయని చేసే వృత్తిని పవిత్రంగా భావించి ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని నరసాపురం డిఎస్పి మనోహర్ చారి చెప్పారు. పాలకొల్లు సర్కిల్లోని సచివాలయం మహిళా పోలీసులకు అడబాల గార్డెన్స్ లో బుధవారం అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండలో డ్యూటీ చేసే హోంగార్డులకు తెల్ల టోపీ, నల్ల కళ్ళజోడు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి సాధకభాదలు ఉంటాయని ఒత్తిడిలు, రాత్రి, పగలు తేడా లేకుండా డ్యూటీ చేయవలసి ఉంటుందని చెప్పారు. సాంకేతికంగా అభివృద్ధి జరుగుతోందని దీనితో మోస ప్రవృత్తి పెరిగిందని చెప్పారు. నేరం జరగకుండా అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలని కోరారు.సైబర్ క్రైం కు వచ్చే ఫిర్యాదు లన్ని విద్యావంతులు చేస్తున్నవి అన్నారు. చిన్నారులు, ఒంటరి మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సచివాలయ మహిళా పోలీసులు చెప్పిన భాదలను జిల్లా ఎస్పి దృష్టిలో పెడతానని సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని చెప్పారు. ఇంకా పాలకొల్లు పట్టణ, రూరల్ సిఐలు జి రాంబాబు, కొండవీటి శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్, రూరల్ ఎస్సై శ్రీనివాస్,పోడూరు పెనుమంట్ర ,వీరవాసరం ఎస్సైలు పాల్గొన్నారు.










