Nov 08,2022 23:35

ప్రశాంత్‌ నగర్‌ సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జడ్పీ సీఈవో


సచివాలయంలో జడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: మంగళవారం జిల్లా పరిషత్‌ సీఈవో ప్రభాకర్‌రెడ్డి 15వ డివిజన్‌ వార్డు సచివాలయంలో అభివద్ది పథకాలు, స్కీములు, లబ్ధిదారుల జాబితా తెలిపే డిస్ల్పేబోర్డులను, పలు రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సచివాలయ సిబ్బంది యూనిఫారం తప్పక ధరించి, విధులకు నిర్ణీత వేళలందు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. వార్డు సచివాలయ సిబ్బంది మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో క్యాంపు వివరాలు నమోదు చేయలేదని, పలు రిజిష్టర్లును అప్డేట్‌ చేయలేదని ప్రతి ఒక్కరూ క్యాంప్‌ వివరాలను మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని వార్డు సచివాలయ సిబ్బందికి జడ్పీ సీఈఓ ఆదేశించారు. అనంతరం ప్రశాంత్‌నగర్‌లో నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్‌కాలనీ నిర్మాణ పనులను పరిశీలించి, పెండింగ్‌ పనులను వెంటనే పూర్తిచేయాలిన్స సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో 15వ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.