Oct 17,2023 19:13

10.45 గంటలకు కూడా తెరుచుకొని మొగిలిచర్ల సచివాలయం

ప్రజాశక్తి - లింగసముద్రం :మొగిలిచర్ల సచివాలయంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పనులు కోసం గ్రామస్తులు మంగళవారం సచివాలయం వద్దకు వచ్చారు. 9.30కి సచివాలయం తీయాల్సి ఉండగా తాళాలు తీయలేదు.. సిబ్బంది ఎవ్వరూ రాకపోడంతో బయటనే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10.45లకు సిబ్బందిలో ఒక్కరూ వచ్చి తలుపులు తీశారు. అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో సిబ్బంది ఇష్టానూసారంగా విధులకు వస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆకస్మిక తనీఖీలు నిర్వహించి సకాలంలో విధులకు హజరుకాని వారిపై చర్యలు తీసుకుంటేనే వారి పనితీరులో మార్పు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. విధులకు వచ్చే సిబ్బంది వారికి నచ్చినట్టు వస్తారు.. వారికి నచ్చినట్టు వెళ్తారని పర్యవేక్షించే అధికారులు అలసత్వం పదర్శించడం వల్లనే సచివాలయం సిబ్బంది అధ్వానంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సిబ్బంది విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.