సచివాలయానికి కంప కొట్టిన దృశ్యం
ప్రజాశక్తి-శింగనమల మండలంలోని రాచేపల్లిలో సచివాలయాన్ని తరలించరాదని స్థానికులు సోమవారం సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. నాలుగు గ్రామాలకు పంచాయతీ కేంద్రమైన రాచేపల్లిలో సచివాలయం ఉండాలని డిమాండ్ చేశారు. అలాంటి సచివాలయాన్ని పంచాయతీలో ఓ గ్రామమైన నిదనవాడకు మార్చాలని చూడటం బాధాకరమన్నారు. సచివాలయం తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










