ప్రజాశక్తి- పలమనేరు: మండలంలోని జిల్లా అధికారి లక్ష్మీ పలు సచివాలయాలను మంగళవారం సందర్శించారు. అందులో భాగంగా మొదటగా ఉదయం 10 గంటలకు సముద్ర పల్లి గ్రామ పంచాయతీ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగుల రిజిస్టర్లు, వాటి నిర్వహణ తీరును పరిశీలించి సూచనలు అందించారు. ఉద్యోగులు అందరూ క్రమశిక్షణతో ప్రజలకు సేవలు అందించే విధంగా మరింత బాగా పని చేయాలని తెలిపారు. అలాగే కూర్మాయి పంచాయతీలో జరుగుతున్న పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ పర్యవేక్షించి ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని సూచించారు. తడి, చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని అవగాహన కల్పించారు. అనంతరం సచివాల యాన్ని సందర్శించి సిబ్బంది, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి, గిరిధర్, జెడ్పీటీసీ మల్లికా రంగనాథం సముద్రపల్లి సర్పంచి తిరుమలేష్, కూర్మాయి సర్పంచి చెంగమ్మ జగన్మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ గ్రామ సచివాలయల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










