Jul 14,2022 22:36

సచివాలయాల్లో జెడ్‌పి సిఇఒ తనిఖీలు
ప్రజాశక్తి- యాదమరి:
జిల్లా పరిషత్‌ సిఇఒ ప్రభాకర్‌రెడ్డి గురువారం జీడినెల్లూరు, యాదమరి మండలాల్లోని గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఇఒ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, స్కీంలు తెలిపే డిస్ప్లే బోర్డులను, పలు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, సర్వీసెస్‌, స్పందన, హౌసింగ్‌ స్కీంలపై అందుబాటులో ఉన్న గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్ష జరిపి, విధులకు యూనిఫారం ధరించకుండా హాజరైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట ప్రతిఒక్కరూ యూనిఫారం ధరించి, నిర్ణీతసమయానికి విధులకు హాజరు కావాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.