Aug 05,2022 22:19

తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి

చిత్తూరు అర్బన్‌ : జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి శుక్రవారం చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని సంజరు నగర్‌ కాలనీ, ఎస్‌ఆర్‌ పురం మండలం నెల వాయి గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని ఆదేశించారు. అలాగే జగనన్న కాలనీల నిర్మాణాలను పరిశీలించి గహ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.