Oct 19,2023 23:06

గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

ప్రజాశక్తి- లావేరు:  సచివాలయ వ్యవస్థతోనే గ్రామ స్వరాజ్యం పాలనను సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎమ్మేల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని బుడుమూరులో ఉపాధిహామీ పథకం నిధులు రూ40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత సిఎంకే దక్కుతుందన్నారు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, ఎంపిడిఒ కుప్పలి సురేష్‌ కుమార్‌, పిఆర్‌ డిఇఇ సీతంనాయుడు, ఇఒపిఆర్‌డి వి.విశ్వేశ్వరరావు, వైస్‌ఎంపిపి లుకలాపు శ్రీనువాసురావు తదితరులు పాల్గొన్నారు.