ప్రజాశక్తి -పొదలకూరు :భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వావింటపర్తిలో గురువారం ఆయన వివిధ అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ గ్రామాలను దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ. కోట్లు ఖర్చుపెట్టి సచివాలయ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాను జెడ్‌పి ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఈ ప్రాంతాలకు తారు రోడ్లు నిర్మించానన్నారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదన్నారు. సోమిరెడ్డి గ్రామాల్లోకి వెళితే ఉద్రిక్తతలు సష్టించే విధంగా మాట్లాడటం తప్ప, తాను చేసిన అభివద్ధిని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు తొలుత ఆయన గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారం భించారు. రూ.1.13 కోట్లతో నిర్మించిన వనంతోపు- మొగళ్లూరు రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించారు. పొదలకూరు ఎంపిడిఒ నగేష్ కుమారి, తహశీల్దార్ వీర వసంతకుమార్, మండల ప్రజా ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, సోమా అరుణ, ఎన్. కష్ణమ్ నాయుడు భాస్కర్ నాయుడు ,నారాయణరెడ్డి, పెంచల్ రెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఎం శేఖర్, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.










