May 21,2023 21:42

సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందుకుంటున్న యు.మల్లికార్జున

        ప్రజాశక్తి-అనంతపురం   సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా యు.మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి నరసింహులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, రాష్ట్ర సహాధ్యక్షుడు ఎంకె వరప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మే 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమ కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతోపాటు జిల్లా సహాధ్యక్షులుగా డి.నూర్‌బాషా, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎ.శివ శంకరయ్య, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.సిద్ధేశ్వర్‌, కె.జానీ శంకర్‌, కె.జైనబ్‌, బి.శ్రీలక్ష్మి, వి.హనుమంతురెడ్డి, ఎ.బాలకృష్ణారెడ్డి, డి.ఓంప్రకాష్‌, జిల్లా కోశాధికారిగా ఆర్‌.మహేష్‌నాయక్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా పీహెచ్‌ మంజునాథ్‌, జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.దాదా, పి.గీత, ఎన్‌.మల్లికార్జున, పి.రానా ప్రతాప్‌, పి.సల్మాన్‌ సుల్తాన్‌, కెయు.మంజునాథ్‌, యు.తిప్పేస్వామి, పి.హరి, టి.సుధాకర్‌, జి.శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జి.అశోక్‌రాజ్‌, బి వెంకటేశులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడు సంవత్సరాల పాటు పని చేయనున్నట్లు తెలిపారు.