Oct 11,2023 21:32

ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దార్‌ ఎం.వి. కె.సుధాకర్‌ బాబు

సచివాలయ సిబ్బంది సమయాపాలన పాటించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని తహశీల్దార్‌ ఎం.వి. కె.సుధాకర్‌ బాబు సూచించారు. బుధవారం మండలంలోని మారంరెడ్డి పల్లి, పబ్బులేటిపల్లి సచివాలయాలను తనిఖీ చేసి హాజరు, మూమెంట్‌ రిజిస్టర్‌ సిబ్బంది విధి నిర్వహణ రిజిస్టర్‌లను పరిశీలించారు. ప్రతిఒక్క సచివాలయ సిబ్బంది పనివేళలలో సచివాలయంలో అందుబాటులో ఉండాలన్నారు.
బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ కచ్చితంగా వేయాలని సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించి వచ్చిన అర్జులను సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం గురువారం పబ్బులేటి పల్లి సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్స్‌ తదితరులు పాల్గొన్నారు.