ప్రజాశక్తి-కోట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ వ్యవస్థలో సిబ్బంది ప్రజాసేవలో ముందుండాలని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని జవ్వనపల్లె సచివాలయాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ నిష్పక్షపాతంగా అందే విధంగా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని తెలిపారు. సచివాలయ పరిధిలోని వాలంటీర్లను సమన్వయపరుచుకుని ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బందిని ఆదేశించారు.










