Mar 09,2022 21:48

స్కూల్‌ను పరిశీలిస్తున్న ఎంపిపి మోహిత్‌రెడ్డి



శిథిలావస్థలో ఉన్న జడ్‌పి హైస్కూల్‌ పరిశీలన
ప్రజాశక్తి - క్యాంపస్‌
బుధవారం 'సచివాలయ బాట' కార్యక్రమంలో భాగంగా దుర్గసముద్రం పంచాయతీలో సచివాలయాన్ని సందర్శించారు. స్వయం సహాయక సంఘాలకు సిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపిఎం పరశురామిరెడ్డి, సిసి మాధవరెడ్డిని పిలిపించి మందలించారు. ఇళ్ల నిర్మాణానికి సేకరించిన స్థలాలకు పరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. పంచాయతీలో 1.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎంపిడిఒ వెంకట నారాయణ, వైస్‌ ఎంపిపి మాధవరెడ్డి, సర్పంచి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దుర్గసముద్రం జడ్‌పి హైస్కూల్‌ను పరిశీలించారు. తరగతి గదులు శిథిలావస్థలో ఉండటాన్ని గమనించారు. నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. భోజనం రుచికరంగా లేదని ఎంపిపి దృష్టికి తీసుకొచ్చారు. రుచికరంగా ఉండేలా చూడాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఆదేశించారు.