Jun 01,2022 17:13

ప్రజాశక్తి-పెద్దపంజాణి: రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఎన్.రెడ్డెప్ప,జడ్పీటీసీ సుష్మాబాగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం శంక్రయలపేట, చామనేరు సచివాలయాల పరిధిలో వేరుశెనగ కాయలు పంపిణీ చేశారు. మండలంలోని రైతులకు 1947.5 కింటాళ్ళు వేరుశెనగ విత్తనాలు అవసరమని, ఇప్పటివరకు1747.5,కింటాళ్ళు వచ్చాయని అన్నారు.30 కేజీల సంచి 2574 రూపాయలు,సబ్సిడీ పోను 1545 రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించిందని మండల వ్యవసాయ అధికారిని  రఖిబా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బాగారెడ్డి, వైస్ ఎంపీపీ.జి.డి బాబు, సింగల్ విండో అధ్యక్షుడు శంకరప్ప,సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరినాథ్,స్థానిక నాయకులు శివాడి సురేష్, ఉపసర్పంచ్ క్రిష్ణమూర్తి, స్థానిక రైతులు పాల్గొన్నారు.