Jul 20,2023 09:08

సబ్సిడీ టమోటా విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు

       అనంతపురం : అనంతపురం నగరంలోని పిఆర్‌పి రైతుబజార్‌లో సబ్సిడీ టమోటా విక్రయ కేంద్రాన్ని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారి పి.సత్యనారాయణ చౌదరి ప్రారంభించారు. ప్రజలకు కిలో 50 రూపాయలకే అందించేలా అమ్మకాలు చేపట్టారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.100కు పైబడి టమోటా ధరలు ఉన్న కారణంగా ప్రజలకు భారం కాకుండా సబ్సిడీ ధరకు టమాటాను రైతుబజార్‌ అందించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. టమోటా ధరలు తగ్గేంత వరకు ఈ కౌంటర్‌ అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రములో రాప్తాడు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రాంప్రసాద్‌, ప్రతాప్‌రుద్ర పాల్గొన్నారు.