Oct 18,2023 20:57

రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ

* వాల్తేరు డిఆర్‌ఎంకు ఎంపీ లేఖ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఏటా అయ్యప్ప దీక్షలు చేపట్టి శబరిమల యాత్రకు వెళ్తుంటారని, వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేరు డివిజనల్‌ మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ యాత్రకు సరిపడా రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే సీజన్‌ మొదలైందని, నవంబరు 15 నుంచి సంక్రాంతి వరకు ఎర్నాకులం-కొల్లం, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు.
త్వరితగతిన ప్రారంభించాలి
రైల్వేశాఖ ఇటీవల ప్రకటించిన విశాఖ-వారణాసి (18311 / 12) ఎక్స్‌ప్రెస్‌ సేవలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కాశీ వెళ్లే రైలుకు 'కాశీ అన్నపూర్ణ ఎక్స్‌ప్రెస్‌'గా నామకరణం చేయాలని సూచించారు. దీనివల్ల యాత్రికులు సులభంగా రైలును గుర్తించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.