మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్
ప్రజాశక్తి - ఉండి
రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఆదివారం చెరుకువాడ పెదపేట యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన కమిటీ కార్యక్రమానికి ముందుగా బైక్ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పుష్ప రాజ్ మాట్లాడుతూ దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల యువజన విభాగం అధ్యక్షులుగా ఏలూరి విజయబాబు, మాల మహానాడు చెరుకువాడ గ్రామ అధ్యక్షులుగా కొత్తపల్లి కృపారావు, ఉపాధ్యక్షులుగా కంకిపాటి విజరు, ప్రధాన కార్యదర్శిగా కొర్రపాటి ఏసు, సహాయ కార్యదర్శిగా చిగురుపాటి కరుణకుమార్, కార్యదర్శులుగా కుచ్చెనపల్లి జీవన్‌బాబు, కొత్తపల్లి ప్రేమ్, పాకలపాటి రమేష్, గునుపూడి బుజ్జిబాబు తదితరులను నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నేతల సువర్ణ రాజు, బందెల ప్రమీల, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నన్నేటి నాగరాజు, నియోజకవర్గ మీడియా విభాగం అధ్యక్షులు జొన్నల వజ్రం పాల్గొన్నారు.










