Sep 19,2023 21:51

బాధ్యతలు స్వీకరిస్తున్న నూరుల్‌ కమర్‌

ప్రజాశక్తి - టెక్కలి, శ్రీకాకుళం అర్బన్‌: టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. టెక్కలి తహశీల్దార్‌ ప్రవళ్లికా ప్రియ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో ప్రజలకు ఉత్తమ సేవలందించాలని నవీన్‌ ఆకాంక్షించారు.