Oct 25,2023 19:11

సౌత్‌ ఆములూరులో వేసిన అక్రమ లే అవుట్‌

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : విచ్చలవిడిగా అక్రమ లే అవు ట్లు వెలుస్తున్నాయి. నిబంధన లు తిలోదకాలిచ్చి ఏర్పాటు చే సున్న ఈ అక్రమ లే అవుట్ల వి షయంలో అధికారులు అనుస రిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్ర భుత్వ నిబంధనలను తుంగ లో తొక్కి ఇష్టారాజ్యంగా వెంచ ర్లు వేస్తున్నారు. ఇరిగేషన్‌ స్థలాలను ఆక్రమించుకొని లే అవుట్లు నిర్మించగా మరికొందరు ఏకంగా ప్రభుత్వ భూముల్లో వెంచర్లు సిద్ధం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపో వడం రియల్‌ వ్యాపారుల దందా యథేచ్ఛగా కొనసాగుతోందని చెబు తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అక్రమ లే అవుట్‌లపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.