Sep 17,2023 23:19

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

* టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌
ప్రజాశక్తి- ఆమదాలవలస: 
సైకో మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద 'మేము సైతం రిలే నిరాహార దీక్ష'కు ఆదివారం సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సిఎం జగన్‌ పరిపాలన లో చేస్తున్న అవినీతిని ప్రశ్నించడమే మాజీ సిఎం చంద్రబాబు నాయుడు చేసిన తప్ప అని ప్రశ్నించారు. అవినీతిపరులుగా చిత్రీకరించడా నికి చేసిన ప్రయత్నమే చంద్రబాబు అరెస్టుకు నిదర్శనమని అన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ద్వారానే ఏర్పడిన శాసన, చట్ట, న్యాయవ్యవస్థలకు కొన్ని అధికారాలు పరిమితులు ఉన్నాయని అన్నారు. జగన్‌ పోలీస్‌ యంత్రాం గాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. చట్టం, రాజ్యాంగం తమకు తెలుసునని, వాటిని ధిక్కరించి ప్రవర్తించే అధికారం పోలీస్‌ యంత్రాంగానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీమెన్స్‌ కంపెనీ ఒప్పందంలో అప్పటి చీఫ్‌ సెక్రటరీగా ఉన్న అజరు కల్లం, ప్రేమ చంద్రారెడ్డిల తప్పు లేనప్పుడు చంద్రబాబు అవినీతి చేశారని, ఎలా అరెస్టు చేశారని, ఇది రాజకీయ కక్షతో చేసిన అరెస్టు అని దుయ్యబట్టారు. ప్రజలకు ఒక చేత్తో రూ.వంద ఇచ్చినట్టే ఇచ్చి... దానికి పది రెట్లు ప్రజల నుంచి దోచుకుంటున్న ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తానని అబద్ధపు హామీనిచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే మడమ తిప్పాడని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తమ్మినేని గీత, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు తమ్మినేని సుజాత, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపదరావు మురళి, తమ్మినేని విద్యాసాగర్‌, తమ్మినేని చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.