Jun 03,2023 22:24

అనంతపురంలో ర్యాలీని ప్రారంభిస్తున్నట్రైనీ కలెక్టర్‌ కుశాల్‌జౌన్‌

         ప్రజాశక్తి-అనంతపురం   సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నగరూరు రసూల్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ట్రైనీ కలెక్టర్‌ కుశాల్‌జైన్‌ ప్రారంభించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్‌ కూడలి మీదుగా టవర్‌క్లాక్‌ వరకూ వెళ్లి తిరిగి కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్‌ మాట్లాడుతూ సైకిల్‌ తొక్కటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు. అంతేగాకుండా శారీరక పటుత్వం లభిస్తుందన్నారు. అలాగే పర్యావరణానికి మనమంతా ఎంతో మేలు చేసిన వారం అవుతామన్నారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ వీరబ్బాయి మాట్లాడుతూ సైకిల్‌ తొక్కడం దినచర్యలో ఒక భాగంగా అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌బిఎన్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సి.ప్రభాకర్‌రాజు, కళాశాల కరస్పాండెంట్‌ పిఎల్‌ఎన్‌.రెడ్డి, అధ్యాపకులు ఎన్‌.ఓబుల్‌రెడ్డి, డాక్టర్‌ మధుసూదన, అడిషనల్‌ డిఎంఅండ్‌హెచ్‌ఒ యుగంధర్‌, పిఒఎన్‌సిడి నారాయణస్వామి, డిఇ ఎంఒ భారతి, డిప్యూటీ డిఇ ఎంఒ త్యాగరాజు, ఎన్‌సిడి స్టాఫ్‌ ఆంజనేయులు, శ్రీరామ్‌, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దపప్పూరు : సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ ఎస్‌.ఉషారాణి ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ 2017 జాతీయ అసంక్రామిత వ్యాధుల పర్యవేక్షణ సర్వే ప్రకారం 41.3 శాతం భారతీయులు శరీరక శ్రమకు దూరంగా ఉన్నారని తేలిందన్నారు. దీనివల్ల గుండె సంబంధ, రక్తపోటు, షుగర్‌, క్యాన్సర్‌ వ్యాధులు వస్తున్నాయన్నారు. ఇందుకు కారణం జీవన శైలిలో చాలా మార్పులు రావడం, శరీరక శ్రమ తగ్గిపోవడం, పొగాకు వాడటం, ఆల్కహాల్‌ తాగడం, గాలి కాలుష్యం, సరియైన ఆహారం తీసుకోకపోవడం ప్రధాన కారణాలు అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షర్మస్‌వలి, లక్ష్మీకుమారి, నాగరత్నాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.