సాయం కోసం ఎదురుచూపు
ప్రజాశక్తి-మర్రిపాడు : రోడ్డు ప్రమాదానికి గురై, చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయమందించాలని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వివరాల మేరకు.. మండలంలోని పడమటినాయుడుపల్లి గ్రామానికి చెందిన రమేష్, రత్నమ్మల కుమార్తె బింధుశ్రీకి సెప్టెంబర్‌లో మైదుకూరు సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మెదడులో రక్తనాళాలు దెబ్బతిని నెల రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. నిరుపేదలైన తల్లిదండ్రులు ఇప్పటికే రూ.20లక్షలకుపైగా అప్పుచేసి వైద్యం చేయించినా కోలుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ చేయాలంటే దాదాపుగా రూ.12లక్షలకు పైగా ఖర్చు అవుతుందని డాక్లర్లు తెలియజేశారు. వైద్యం చేయించడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఆపరేషన్ కోసం ఆర్థికసాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. సహాయం కోసం కె.మదన్ ఫోన్‌పే నెంబర్ 7095656091కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.










