బలి పీఠం వద్ద నీరుజల్లుతున్న అధికారులు
ప్రజాశక్తి - తిరుమల
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆనందనిలయం మొదలు బంగారు వాకిలి వరకు ఆగమోక్తంగా నిర్వహించారు.










