Mar 24,2022 22:58

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ముఖ్య నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. ప్రైవేటీకరణకు రెడ్‌కార్పెట్‌ పరుస్తోందని మండిపడ్డారు. ఫలితంగా కార్మికులు తమ కనీస హక్కులను కోల్పోతున్నారని వాపోయారు. సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, జాకీర్‌, ఏఐటీయూసీ నాయకులు మణి, మోహన్‌రెడ్డి, జనమాల గురవయ్య, చామండేశ్వరి, సీఐటీయూ నాయకులు కృష్ణ, ఈశ్వరయ్య, గంధం మణి తదితరులు పాల్గొన్నారు.