Mar 20,2022 21:59

సారా విక్రేత అరెస్ట్‌ చూపుతున్న సెబ్‌ పోలీసులు


ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌:
స్థానిక సీటీఎం రోడ్డు సమీపంలోని చీకులగుట్లో కాపురముంటున్న బి.గంగప్ప నాయక్‌(33) గత కొంత కాలంగా నాటుసారా జోరుగా విక్రయించే వాడన్నారు. ఈ క్రమంలో మండలంలోని నారమాకుల తాండా నుంచి ఆదివారం ఉదయం మదనపల్లికి 96 సారా ప్యాకెట్లు (48) లీటర్ల సారాను తీసుకువచ్చాడని, ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ అంజాద్‌భాష సిబ్బందితో గంగప్ప నాయక్‌ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా తనిఖీల్లో సారా పట్టుబడింది. గంగప్పపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు.