30 లీటర్ల సారా స్వాధీనం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
నిందితుల అరెస్టుకు సంబంధించి సీఐ మురళీ కిషోర్ విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన బాలాజీనాయక్ (26) పట్టణానికి సమీపంలోని వడ్డిపల్లి దగ్గర 20లీటర్ల సారా తీసుకుని బుగ్గ కాలువ దగ్గరున్న ఇంటికి వస్తుండగా రోడ్డు తనిఖీలో బాలాజీ నాయక్ సిబ్బందికి పట్టుబడినట్లు తెలిపారు. అలాగే మదనపల్లి మండలం సిటిఎం పంచాయతీ, కొత్త కూరాకుల పల్లికి చెందిన దామోదర్ (38) తన ఇంట్లో పది లీటర్ల నాటుసారా క్యాన్లు దాచుకుని స్థానికులకు విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. దాడుల్లో సీఐ మురళీ కిషోర్‌తో పాటు అంజాద్ బాషా, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు..










