స్వాధీనం చేసుకున్న సారాతో పీలేరు ఎస్‌ఈబి బృందం
ప్రజాశక్తి-పీలేరు:
మంగళవారం రహస్య సమాచారం మేరకు పీలేరు మండలం, గూడరేవుపల్లి పంచాయతీ, రామానాయక్ తాండాకు సమీపంలోని అటవీ ప్రాంతంలో దాడులు జరిపామన్నారు. ఈ ప్రాంతంలో 15 లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకున్నామని, అలాగే 900 లీటర్ల సారా ఊటను ద్వంసం చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబి సిబ్బంది లోకేష్, సుధాకర్, సురేష్ పాల్గొన్నారు.










