Mar 20,2022 21:49

మృతి చెందిన జీవన్‌ కుమార్‌ రెడ్డి




ఏడాది క్రితం కోవడ్‌ భారిన పడి తల్లిదండ్రులు మృతి
ఒంటరి జీవితాన్ని సాగించలేక బలవన్మరణం

ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్‌:
ఈ ఘటనకు సంబంధించి టూటౌన్‌ సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం, కోట గుడిబండకు చెందిన దంపతులు బుసిరెడ్డిగారి నాగభూషణ రెడ్డి, సులోచనలు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మదనపల్లి వచ్చి ఇక్కడే స్ధిరపడ్డారు. వీరు ప్రశాంత్‌ నగర్‌లోని ఎక్సెన్షన్‌ ఏరియాలోని ఓ అద్దె ఇంటో కాపురం ఉంటూ స్థానిక వెంకట్‌రెడ్డి సిద్ధార్థ కాలేజీ హాస్లల్‌లోని పిల్లల కోసం మెస్‌ నిర్వహించేవారు. వీరి కొడుకు జీవన్‌ కుమార్‌రెడ్డి బెంగళూరులోని ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసేవాడు. కోవిడ్‌ సమయంలో వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తూనే మెస్‌లోనూ తల్లిదండ్రులకు సహాయపడేవాడు. ఈనేపథ్యంలో 11నెలల క్రితం నాగభూషన్‌రెడ్డి, సులోచనలు ఒకరి తరువాత ఒకరు మూడు రోజుల వ్యవధిలోనే మరణించారు. దీంతో జీవన్‌ మానసింగా కృంగిపోయాడు, ఒంటరిగా జీవనం సాగించలేక ఇబ్బంది పడేవాడు. ఇదిలా ఉండగా జీవన్‌ ఓ యువతిని ప్రేమించాడని, ఆమె వారం రోజులుగా ఫోన్‌ తీయకపోవడంతో విరక్తి చెంది అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ చంద్రమోహన్‌, ఏఎస్‌ఐ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆసుప్రతికి తరలించారు.