Mar 21,2022 23:40

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం



ప్రజాశక్తి - క్యాంపస్‌
స్థానిక కొండారెడ్డిగారి రాయలసీమ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్మ్ఫర్‌మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (రిమ్స్‌)లో ఎంబిఏ విద్యార్థులకు రెండు రోజుల ఇండిస్టీయల్‌ ప్రాజెక్టు సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారానే విద్యార్థులు ఉన్నతంగా రాణించగలరన్నారు. సామాజిక, ఆర్ధిక, ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో అనేక నూతన ప్రాజెక్టులు రూపుదిద్దుకొంటున్నాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో తరగతులకు హాజరై నూతన అంశాలను గురించిన అవగాహన చేసుకోవలసిన ఆవశ్యకతను గురించి వివరించారు. విద్యార్థులకు పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి వివరించి, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబిఏ విభాగాధిపతి పి.నిరంజన్‌రెడ్డి, ఎంసిఏ విభాగాధిపతి పి.మధుర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.