Apr 24,2023 21:07

టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
టిడిపి నాయకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమాన్ని తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ రూపొందించిన యాప్‌లను సక్రమంగా వినియోగిస్తూ సోషల్‌ మీడియాలో దూసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అందరూ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ పొంది పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ డ్వాక్రా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరగాని నారాయణమ్మ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, కనకదుర్గ పాల్గొన్నారు.